Telugu Global
Health & Life Style

ముందు జాగ్రత్త... ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్

ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. మరి ఈ కిట్‌లో ఏమేమి ఉండాలంటే… ఫస్ట్ ఎయిడ్ మాన్యువల్(ఇందులో ప్రథమ చికిత్స ఎలా చేయాలో వివరంగా రాసి ఉంటుంది, దానిని క్షుణ్ణంగా చదవాలి), స్టెరిలైజ్ చేసిన గాజ్ రోల్, అతికించడానికి టేప్, చిన్న గాయాలకు వేసే రెడీమేడ్ బ్యాండేజ్‌లు (వాటికే జిగురు కూడా ఉంటుంది. రేపర్ తీసి గాయం మీద అతికించేవి), ఎలాస్టిక్ బ్యాండేజ్, స్ల్పింట్ (చేతివేళ్లను కదిలించడానికి వీలుగా ఉండే బ్యాండేజ్), యాంటీ సెప్టిక్ వైప్స్, […]

ముందు జాగ్రత్త... ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్
X

ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. మరి ఈ కిట్‌లో ఏమేమి ఉండాలంటే… ఫస్ట్ ఎయిడ్ మాన్యువల్(ఇందులో ప్రథమ చికిత్స ఎలా చేయాలో వివరంగా రాసి ఉంటుంది, దానిని క్షుణ్ణంగా చదవాలి), స్టెరిలైజ్ చేసిన గాజ్ రోల్, అతికించడానికి టేప్, చిన్న గాయాలకు వేసే రెడీమేడ్ బ్యాండేజ్‌లు (వాటికే జిగురు కూడా ఉంటుంది. రేపర్ తీసి గాయం మీద అతికించేవి), ఎలాస్టిక్ బ్యాండేజ్, స్ల్పింట్ (చేతివేళ్లను కదిలించడానికి వీలుగా ఉండే బ్యాండేజ్), యాంటీ సెప్టిక్ వైప్స్, యాంటీ బయాటిక్ ఆయింట్‌మెంట్ లేదా యాంటీ బయాటిక్ పౌడర్, హైడ్రోజెన్ పెరాక్సైడ్ లేదా ఏదైనా యాంటీ సెప్టిల్ సొల్యూషన్, సబ్బు, హైడ్రోకార్టిజోన్ క్రీమ్, బ్రూఫెన్ వంటి నొప్పి నివారణ మాత్రలు (నెలకోసారి వీటి ఎక్స్‌పైరీ డేట్ చూసి అవసరమైనప్పుడు కొత్తవి చేర్చాలి), కత్తెర, సేఫ్టీ పిన్నులు, ట్వీజర్స్, వాడిపారేయడానికి వీలుగా పేపర్ టవల్స్ లేదా ఇన్‌స్టంట్ కోల్డ్ ప్యాక్స్, కేలమైన్ క్రీమ్, ధర్మామీటర్, గ్లవ్స్, చిన్న పుస్తకంలో ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ నంబర్లు, ఫ్లాష్‌లైట్, దానికి బ్యాటరీలు. ఇవన్నీ ఇంట్లో ఉండాల్సిన ప్రథమచికిత్స పెట్టెలో ఉండాల్సినవి. ప్రయాణాలలో వీటితోపాటు జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు, వాంతులు తగ్గించే మందులు కూడా ఉండాలి. అలాగే రక్తపోటు, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి వాటికి రోజూ మందులు వాడేవారు ఆ మందులను కూడా కలుపుకోవాలి.

First Published:  23 March 2015 8:30 AM GMT
Next Story