Telugu Global
Health & Life Style

హెల్త్‌కార్డులపై కార్పోరేట్‌ ఆసుపత్రులతో ఆరోగ్యశాఖ చర్చలు

తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన హెల్త్‌కార్డులను కార్పోరేట్‌ ఆసుపత్రులు పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. నగదురహిత చికిత్సకు కార్పోరేట్‌ ఆసుపత్రులు వ్యక్తంచేస్తున్న అభ్యంతరాలను చర్చించడానికి ఏప్రిల్‌ నాల్గొవ తేదీన కార్పోరేట్‌ ఆసుపత్రులతో వైద్యఆరోగ్యశాఖ అధికారులు సమావేశమవుతున్నారు. బహుశా ఈ సమావేశంలో ప్రభుత్వానికి, కార్పోరేట్‌ ఆసుపత్రులకు మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒప్పందం కుదిరితే ఇప్పటివరకు హెల్త్‌కార్డులు అందని ఉద్యోగ, ఉపాధ్యాయులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు మరోదఫా హెల్త్‌కార్డులు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

X

Next Story