Telugu Global
NRI

‘హాంగ్‌కాంగ్‌లో తెలుగు సమాఖ్య’ ఉగాది వేడుకలు

హాంగ్‌కాంగ్‌లో ‘ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య’ పేరుతో తెలుగు వారిని ఒక వేదిక మీదకు తీసుకు వచ్చారు జయ పీసపాటి. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం పని చేస్తున్న ఈ సమాఖ్య ఏటా స్పోర్ట్స్ డే, ఉగాది వేడుకలు, సిలికానాంధ్ర మనబడి కార్యక్రమంలో భాగంగా తెలుగు తరగతులు నిర్వహించింది. అలాగే పండుగ పర్వాలను ఈ తరానికి తెలియచేసే ఉద్దేశంతో సామూహిక సత్యనారాయణ వ్రతం, సామూహిక లలితా సహస్రనామావళి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా […]

‘హాంగ్‌కాంగ్‌లో తెలుగు సమాఖ్య’ ఉగాది వేడుకలు
X

హాంగ్‌కాంగ్‌లో ‘ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య’ పేరుతో తెలుగు వారిని ఒక వేదిక మీదకు తీసుకు వచ్చారు జయ పీసపాటి. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం పని చేస్తున్న ఈ సమాఖ్య ఏటా స్పోర్ట్స్ డే, ఉగాది వేడుకలు, సిలికానాంధ్ర మనబడి కార్యక్రమంలో భాగంగా తెలుగు తరగతులు నిర్వహించింది. అలాగే పండుగ పర్వాలను ఈ తరానికి తెలియచేసే ఉద్దేశంతో సామూహిక సత్యనారాయణ వ్రతం, సామూహిక లలితా సహస్రనామావళి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా తెలుగు రేడియో కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. ఈ ఏడాది… మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకలను ఈ నెల 22వ తేదీన నిర్వహించింది. ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య (టిహెచ్‌కెటిఎస్) ఈ ఏడాది ‘సాయి వాన్ హూ’ లో ‘తెలుగు భాష- సమాజ సేవ- యువత-భవిత’ అంశాల ఆధారంగా సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది.

First Published:  21 March 2015 5:53 AM GMT
Next Story