Telugu Global
Andhra Pradesh

నా కుమార్తె గురించి కాదు.. నీ భార్యలు, పబ్‌లో దొరికిన మీ అన్న కుమార్తె గురించి చెప్పు..

ఆమెకు ముద్రగడ అన్న ఇంటి పేరు కూడా లేదన్నారు. అయినా సరే ముద్రగడ కుమార్తె అని పరిచయం చేయడానికి సిగ్గులేదా పవన్ కల్యాణ్ అంటూ ఫైర్ అయ్యారు.

నా కుమార్తె గురించి కాదు.. నీ భార్యలు, పబ్‌లో దొరికిన మీ అన్న కుమార్తె గురించి చెప్పు..
X

బహిరంగ సభలో తన కుమార్తెను ప్రజలకు పవన్ కల్యాణ్ పరిచయం చేయడంపై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చి తన కుటుంబంలో పవన్ కల్యాణ్ చిచ్చుపెట్టారని ఆరోపించారు. తనతో బంధం తెంచుకున్న వ్యక్తిని ముద్రగడ కుమార్తె అంటూ ఎలా పరిచయం చేస్తారని నిలదీశారు. ఆమె మామగారి పేరుతోనో, భర్త పేరుతోనో పరిచయం చేయవచ్చు కదా అన్నారు.

ఇప్పుడు ఆమెకు ముద్రగడ అన్న ఇంటి పేరు కూడా లేదన్నారు. అయినా సరే ముద్రగడ కుమార్తె అని పరిచయం చేయడానికి సిగ్గులేదా పవన్ కల్యాణ్ అంటూ ఫైర్ అయ్యారు. ఇదే తరహాలో నీ తొలి, రెండో భార్యలను డయాస్‌ మీదకు తెచ్చి ప్రజలకు పరిచయం చేయ్ అంటూ విరుచుకుపడ్డారు. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాను.. ఇదిగో మూడో భార్య అంటూ పరిచయం చేయవచ్చు కదా అంటూ నిలదీశారు.

మీ కుటుంబంలోని అమ్మాయిల విషయాలు మాకు తెలియవా.. మీ అన్న కుమార్తె పబ్‌లో తాగి డ్యాన్సులేస్తుంటే పోలీసులు పట్టుకెళ్లలేదా అని ప్రశ్నించారు. మరో అమ్మాయి లవ్‌ చేసి వెళ్లిపోయింది కదా దాని గురించి ఎందుకు మాట్లాడవు అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రచార సభల్లో ముద్రగడ జోహర్‌ అంటూ మీ అభిమానులను అనిపించడం ఎంత వరకు సమంజసం అని ముద్రగడ ప్రశ్నించారు.

First Published:  6 May 2024 7:47 AM GMT
Next Story